శివ కవులకు నవ కవులకు
శివ భక్త్కికి దత్త్వమునకు జింతామణికిన్
శివలోక ప్రమథులకును
శివునకు గురువునకు శరణు సేయర వేమా
శ్రీకరంబుగ వేమన చెప్పినట్టి
పద్యముల నెవ్వడేనియు బటనజేయు
నట్టి పురుషుడు మనముననిట్టిదనుచు
జెప్పరానట్టి వస్తువు జేరు వేమ
1.వేమ ననగ యోగి వెలసె లోకములోన
బూజులిడుడు పుణ్య పురుషులార
పూజ లిడినయంత భుక్తి ముక్త్కుల నిచ్చు
విశ్వదాభిరామ వినురవేమ
2.పలుకుమన్ననేల పలుకకయున్నావు
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకుమయ్య నీదు పలుకు నే నెరిగెద
విశ్వదాభిరామ వినురవేమ
3.ఆత్మశుద్ధిలేని యాచార మది యేల
భాండశుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ
4.నిక్కమయిన మంచినీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రళ్ళు తట్టెడేల
చదువ బద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ
5.నిన్ను జూచెనేని తన్నుదా మరచును
తన్ను జూచెనేని నిన్ను మరచు
నేవిధమున జనుడు నెరుగు నిన్నునుదన్ను
విశ్వదాభిరామ వినురవేమ
6.మురియువాడెవడు మురియని దెవ్వడు
సాటు జేసి చూద బట్టబయలు
సొరిది జలఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినురవేమ
7.గాజుకుప్పెలోని కడగుచు దీపంబు
నెత్తులుందు జ్ఞాన మట్టులందు
దెలిసినట్టీవారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినురవేమ
8.కల్లగురుఁడు కట్టు నెల్లకర్మంబుల
మధ్య గురుఁడు కట్టు మంత్రచయము
నుత్తముండు గట్టుయోగ సామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ
9.పెట్టిపోయలేని వట్టినరులు భూమి
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ
10.తాముగన్నవారు తముఁ గన్నవారు
జచ్చుటెల్ల తమకు సాక్షిగాదె
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబులా
విశ్వదాభిరామ వినుర వేమ
11.ఎఱుకమాలువాడు నేమేమి చదివినఁ
జదివినంత సేపె సద్గుణియగు
కదిసి తామరందుఁ గప్పకూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
12.కూటికి నెడఁబాసి కూర్చున్న మనుజుఁడు
వెలఁదులఁ గనుగొన్న వెతలఁజిక్కు
చెలఁగి యగ్నిఁజూచు శలభంబు చాద్పున
విశ్వదాభిరామ వినుర వేమ
13. కసువుఁ బసికిఁజేసె గాలి ఫణికిఁ జేసె
మన్నెఱలకుఁ జేసె మఱవకెట్లు
కుంభిని జనులకును గూడట్లు చేసెరా
విశ్వదాభిరామ వినుర వేమ
14. ఎవ్వరి గుణములును వేమన్న మానవు
చక్కఁజేయరాదు కుక్కతోఁక
గడుసురాలినిగన గంపఁబెట్టమ్మురా
విశ్వదాభిరామ వినుర వేమ
15.వేరుపురుగు చేరి వ్రుక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టుఁ జెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ
16.ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడవేఱు
పురుషులందుఁ బుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినుర వేమ
17.జీవిపోకముందె జీవ వస్తువులిచ్చి
జీవి నిలుపవలయు జీవనముగ
జీవి తొలఁగువెనక జీవ వస్తువు లేల
విశ్వదాభిరామ వినుర వేమ
18.కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెఱుఁగును
నీరు పల్ల మెఱుఁగు నిజముగాను
తనయుని జననంబు తల్లి తా నెఱుఁగును
విశ్వదాభిరామ వినుర వేమ
19.అంగమెల్ల వదలి యటు దంతములు నూడి
తనువు ముదిమిచేతఁ దఱచువడక
ముప్పు తిప్పలఁబడి మోహంబు విడువరు
విశ్వదాభిరామ వినుర వేమ
20.ఆడువారిఁగన్న నర్థంబు పొడఁగన్న
సారమైన రుచుల చవులు గన్న
అయ్యగాండ్రకైన నాశలు పుట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ
Friday, January 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
What a wonderful idea to begin... Keep up the good work.
ReplyDelete"Whatever you dream you can do, begin it. Boldness has genius, power and magic in it."
-- Goethe
Would it be a good idea to add the meanings in Telugu and English? Here is the link for English version of C.P.Brown :
http://www.scribd.com/doc/22659270/Vemana-1352-1430-Verses
Subbaiah
P.S.: Yes, I noticed the title!