Monday, May 24, 2010

Division

201.శ్రీకర శివ తత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయుపద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినుర వేమ

202.వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినుర వేమ
201.శ్రీకర శివ తత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయుపద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినుర వేమ

202.వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినుర వేమ

Thursday, February 25, 2010

201-220

201.శ్రీకర శివ తత్వశీలుఁడౌ వేమన
ప్రాకటముగ వేయుపద్యములను
లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో
విశ్వదాభిరామ వినుర వేమ

202.వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినుర వేమ

203.శతసంఖ్యపదమ్ముల నే
మతిమంతుడు పఠనసేయు మమతలు దీరు
న్నతఁడే నాలుగుపదముల
శితికంఠునిపదము జేరు సిధ్ధము వేమా

204.ఎన్నఁగ మనసే కారణ
మన్నిటికిని జూడఁజూడ నాత్ముఁడు తానై
యున్నంతకాల మెచ్చట
నున్నను నిదినిజముఁ దెలియ నొప్పగు వేమా

205.సర్వము తానని తెలిసిన
నిర్వాణికిఁ గాక ముక్తి నిలుపఁగ వశమా
ఉర్వెల్లఁ దాను తిరిగిన
పర్వత బిలజలధులందుఁ బడినను వేమా

206.చదువులఁ జదివినవారలు
పదవిని బొందంగలేరు పరమార్థముగాఁ
బెదవులఁ గదలకయుండిన
మదిలో నది రాజయోగమహిమము వేమా

207.తలపఁగ మూలమందు పరతత్వము దెల్పగ పాటుగాదు లో , బలిమిని నాత్మగుట్టు మది భావననెంచగ బ్రహ్మకల్పమును , గలుగును ముక్తి జీవులకుఁ గావున నాత్మవిధానద్రుశ్య మీ సలలిత శక్తిరూపు నిను నన్నుతి వేమన చేసె కల్పమున్

208.ఆకు చాటునుండు నన్నిలోకంబులు
కొమ్మ గానరాదు బ్రహ్మకైన
కొమ్మ గానఁబడినఁ గొనియాడవచ్చురా
విశ్వదాభిరామ వినుర వేమా

209.పిలిచినఁ బల్కకుండు మఱి పిల్చిన నేమనకూరకుండుఁద, దలఁచిన నెవ్వ రేమనినఁ దన్నునుగాదని నవ్వుచుండు నా,త్మలఁ దలపోయుచుండు నెఱ తత్వము నిత్యము దానయై సదా, తెలిసినయోగి వేమనగతి శివరూపుఁడు నెల్ల తావుల

210.ఒక్కడు రోగి యాయె మఱి యొక్కఁడు దిక్కులఁద్యాగి యాయె , వేఱొక్కఁడు భోగి యాయె నటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ, దా నొక్కఁడు రాగి యాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట, నిక్కము నిన్ని రూపములు నీకును జెల్లుగదన్న వేమనా

211.విషయములు తెరల పొలుపున
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విషసంసారము లన్నియు
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చున్

212.కాదని యెవ్వరితోడను
వాదాడక దిరుగు వెర్రి వాఁడును వలెనే
భేదాభేదము లడచును
వేదాంతరహస్య మెల్ల వేమన నేర్చున్

213.దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁజంపును వైరుల
విశ్వదాభిరామ వినుర వేమ

214.ఎందు నెఱుకవాని కిహపరములు లేవు
ప్రాణహానిలేదు ప్రళయమునను
ప్రళయకాలమైనఁ బరమాత్ముఁ గలయురా
విశ్వదాభిరామ వినుర వేమా

215.దేవుఁడనగ వేఱు దేశమందున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినుర వేమా

216.సొమ్ముదొరకుదనుక జ్యోతి యంతియెకాక
సొమ్ము దొరకువెనక జ్యోతియేల
దేవుఁడైన వెనుక దేహంబు మఱియేల
విశ్వదాభిరామ వినుర వేమా

217. గురుచరణముఁబట్టఁ గుక్కలు గఱచును
గురుచరణము విడువఁ గుక్క గఱచుఁ
గుక్కకున్న బుద్ధి గురనకు లేదురా
విశ్వదాభిరామ వినుర వేమా

218.ఆత్మబుద్ధివల్ల నఖిలంబు తానయ్యె
జీవబుద్ధివలన జీవుఁడయ్యె
మోహబుద్ధినియము ముందరఁగనుగొని
విశ్వదాభిరామ వినుర వేమా

219.ఈ దేహ మన్నిభంగులఁ
బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె
మీఁదెఱిగి మురికి గడుగను
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా

220.పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగ
నధియు కోడిఁబట్ట ననుగమించు
మమత విడువకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినుర వేమా

Thursday, January 21, 2010

181-200

181.లోకములకు గురువు లోకులకును గురు
వదియుఁ దెలిసిమోక్ష మందురోరి
గురునిఁ గనక నరక కూపము నందురు
విశ్వదాభిరామ వినుర వేమ

182.జీవిలోననుండు సిద్ధునిగానక
తిరుగు నస్థిరంబు వరుసనమ్మి
స్థిరము నస్థిరమును దెలియ జీవికి ముక్తి
విశ్వదాభిరామ వినుర వేమ

183.గతము చూతమన్న కలఁగన్న యర్థంబు
నడుచు కార్యమేని నమ్మరాదు
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి
విశ్వదాభిరామ వినుర వేమ

184.తాననంగ నెవరు తనవారన నెవరు
తెలిసి తెలియలేరు తిక్కనరులు
అరయ పిసినికాయ పురుగు పద్ధతికాగ
విశ్వదాభిరామ వినుర వేమ

185.భయముసుమీ యజ్ఞానము
భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ
లయముసుమీ యీదేహము
జయముసుమీ జీవుఁడనుచుఁ జాటర వేమా

186.చచ్చెఁ జచ్చె ననుచుఁ జావుకు వగ చెడు
దీననరుల వెఱ్ఱి దెలుపరాదు
ప్రాణమునకు మ్రుత్యు బంధంబు లుడుగునా
విశ్వదాభిరామ వినుర వేమ

187.జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు
మొదట కర్తగాఁడు తుదను గాఁడు
నడుమకర్త ననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ

188.బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు
వెఱ్ఱిమూర్ఖ జనుల విధముఁజూడ
బ్రహ్మ మన్నిటందుఁ బరిపూర్ణమైయుండు
విశ్వదాభిరామ వినుర వేమ

189.పసులవన్నె మేఱు పాలేకవర్ణమౌ
పుష్పజాతి వేఱు పూజయొకటి
దర్శనంబు వేఱు దైవం బ దొక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ

190.పనితొడవులు వేఱు బంగారమొక్కటి
పరగ ఘటము వేఱు ప్రాణమొకటి
అరయఁ దిండ్లు వేఱు ఆఁకలి యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ

191.కానలేఁడు నుదురు కర్ణముల్‌ వీపును
నెఱులు కానలేఁడు నెత్తిమీఁద
తన్ను గానలేఁడు తత్వమెఱుఁగును
విశ్వదాభిరామ వినుర వేమ

192.తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక
అందువలన నేమి యాసలేదు
అంతరాత్మ నిలుపునతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ

193.చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడే
శక్తియనెడు చెట్టు పడును పిదపఁ
గోర్కు లనెడు పెద్ద కొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినుర వేమ

194.తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక
యూరకన్నఁ జూడనుర్విమీద
వాఁడగు పరమాత్మ వర్ణింప శక్యమా
విశ్వద్దభిరామ వినుర వేమ

195.కల్మషఁబు సోఁకఁ గనుపించ దెందును
రూప మెవ్వరికిని రూడితోడ
తామసం బుడుగినఁ దగఁగల్గు జ్ఞనంబు
విశ్వదాభిరామ వినుర వేమ

196.నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
పాటిజగతి లేదు పరము లేదు
మాటమాటకెల్ల మనసు కోరుచునుందు
విశ్వదాభిరామ వినుర వేమ

197.దొంగ తెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగాని పనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడవలె
విశ్వదాభిరామ వినుర వేమ

198.ఆసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి
గొచి బిగియఁబెట్టి కోపమడఁచి
గుట్టు మీఱవాఁడు గురువుకు గురువురా
విశ్వదాభిరామ వినుర వేమ

199.ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి
పారవైవఁగాని పరము లేదు
కొక్కు తిండియాసఁ జిక్కి చచిచినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

200.చెవులు గోరును మంచి జిలిబిలిపాటలఁ
దియ్యని మాటల తెఱఁగు వినఁగ
చర్మంబు గోఱును సరవితొడుత శీత
ప్రుథుల సంస్పర్శ సంపదల నెపుడు
కన్నులు గోరును గమలయవర్ణంబు
లయినట్టి రూపంబు లనువుతోడ
నాలుక గోరును నయముతోడుత తీపు
నొగరు కారమ్ము చేదుప్పు పులుసు
ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వముక్కు
నిన్నియుం చాడినటువంటి యిల్లురోసి
తన్ను గనుగొని సుఖియింపఁ దగును వేమ

Wednesday, January 20, 2010

161-180

161.అధికుడైన రాజు నల్పుని చేపట్టు
వానిమాట చెల్లు వసుధలోన
గణికు లొప్పియున్న గవ్వల్లు చెల్లవా
విశ్వదాభిరామ వినుర వేమ

162.దానములను జేయఁదన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినుర వేమ

163.నిత్యంబు కానియొడలికి
నిత్యము దుఃఖమునఁబడును నిరతము ధరలో
నిత్యానందపు పదవికి
నిత్యంబును దుఃఖపడఁగ నేరదు వేమా

164.విను వివేక మనెడి వింతగొడ్డలిచేత
వలయువిద్యయనెడు నడవి నఱికి
తెలివి యనెడు గొప్ప దీపంబు చేఁబట్టి
ముక్తిఁ జూడవచ్చు మొనసి వేమ

165.ఎక్కడిసుతు లెక్కడిసతు
లెక్కడిబంధువులు సఖులు నెక్కడిభ్రుత్యుల్
డొక్కువడి పోవువేళలఁ
జక్కటిని నెవరురారు సహజము వేమా

166.పాలనీరుక్రమము పరమహంస యెఱుంగు
నీరుపాలక్రమము నెమలి కేల
అజ్ఞుఁడయినవాఁడు నలశివు నెఱుఁగునా
విశ్వదాభిరామ వినుర వేమ

167.కన్నులందు మదము గప్పి కానరుగాని
నిరుడు మీదటేఁడు నిన్న మొన్న
దగ్ధులయిన వారు తమకంటెఁ దక్కువా
విశ్వదాభిరామ వినుర వేమ

168.దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబులమఱుగుత్రోవఁ బడుదురు వేమా

169.ఏరుదాఁటి మెట్ట కేగినపురుషుండు
పుట్టి సరుకుగొనక పోయినట్లు
యోగపురుషుఁడేల యొడలిఁ బాటించురా
విశ్వదాభిరామ వినుర వేమ

170.మంటికుండవంటి మాయాశరీరంబు
చచ్చు నెన్నడయినఁ జావఁ డాత్మ
ఘటము లెన్నియైన గగనంబదేకమే
విశ్వదాభిరామ వినుర వేమ

171.మాయను చెఱసాల మనమను గొలుసును
భేదమనెడుబొండ బెరసియుండు
ఇట్టి బద్ధజీవి కెన్నడు మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ

172.ఎఱుకకన్నను సుఖమె లోకమునలేదు
ఎఱుకనెఱుఁగ నెవని కెఱుకలేదు
ఎఱుకసాటి యెఱుక యేతత్వమున లేదు
విశ్వదాభిరామ వినుర వేమ

173.కనియుండి కానలేరట
వినియుండియు వినగలేరు విస్మయ మేమో
కనుగ్రుడ్డియు వినుచెవుడం
చనునది నిజమయ్యె జగమునందున వేమ

174.ఊరకుంట దెలియ నుత్తమయోగంబు
మానసంబు కలిమి మధ్యమంబు
ఆసనాది విధుల నధమ యోగంబురా
విశ్వదాభిరామ వినుర వేమ

175.మనసుసూచి గెల్చి మనసులోసుఖియించి
కడకు మోక్షపదము గనునువాఁడు
చెట్టుఁబెట్ట ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినుర వేమ

176.మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్నుఁ దెలియరాదు
సురియఁబట్టవచ్చు శూరుండు కారాదు
విశ్వదాభిరామ వినుర వేమ

177.చూపువెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే
చిత్తమనెడు దివ్వె నెన్ను పఱచి
పాపమనెడు తిమిర మేపాఱ పాపని
పాపజాతి గురుఁడు పశువు వేమ

178.గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామ్రుతంబురా
విశ్వదాభిరామ వినుర వేమ

179.గురుఁడనఁగా మొదలంతకు
గురుశిష్యు లనంగ నెల్ల కొమ్మలుకాగా
గురువును గానగఁ జాలరు
ధరలోపల మనుజులెల్లఁ దలపరు వేమా

180.గురుఁడనఁగా పరమాత్ముఁడు
పరగంగా శిష్యుఁడనఁగఁ బటుజీవుఁ డగు
గురుశిష్య జీవసంపద
గురుతరముగఁ గూర్చు నతఁడు గురువగు వేమా

141-160

141.ఎన్నాళ్ళకుఁ దానుండును
ఎన్నాళ్ళను దాని నేర్చి యెన్నిటవెలయుఁ
కొన్నాళ్ళకుఁ దాఁజన్నను
మన్నేయగు విద్యలెల్ల మహిలో వేమా

142.ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చుఁ
ధనముడుగిన మదముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా

143.వినవలె నెవ్వరు చెప్పిన
వినినంతనె తమక పడక వివరింపవలె
విని కని వివరము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో వేమా

144.ఈకపట నాటకంబును
ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప
ఏకపటాత్ముఁడు సేసెనొ
యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా

145.ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు
నిండుకుండ నీరు నిలిచినట్లు
దండిగఁ బరమాత్మ తత్వంబు దెలియరా
విశ్వదాభిరామ వినుర వేమ

146.ఎండినమ్రా నొక టడవిని
నుండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్ల
దండిగలవంశ మెల్లను
చండాలుం డొకఁడుపుట్టి చెఱుచును వేమా

147.శిష్యవర్గమునకు శివుఁ జూపనేరక
కానిమతములోని గలుగునట్టి
గురునియెఱుక నరయ గ్రుడెద్దు చేనురా
విశ్వదాభిరామ వినుర వేమ

148.ఇంటిలోనిధనము నిదినాది యనుచును
మంటిలోనఁ దాచు మంకుజీవి
కొంచఁబోడు వెంట గుల్ల కాసును రాదు
విశ్వదాభిరామ వినుర వేమ

149.దేశవేశములను తేటసేయక దేవుఁ
డాత్మలోన నుండు ననగిపెనగి
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినుర వేమ

150.మిఱపగింజ జూడ మీఁద నల్లగనుండుఁ
గొఱికిచూడలోన చుఱుకుమనును
సజ్జను లగువారి సారమిట్టుల నుండు
విశ్వదభిరామ వినుర వేమ

151.పర్వత వనవాసి పరిణామ వర్తన
కూపవాసి కెట్టు గుఱుతుపడును
బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాక్రుతుఁ డరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ

152.కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు
పరిమళించుదాని పరిమళంబు
గురువులయినవారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ

153.దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

154.గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
న్రుపతిలేక భూమి త్రుప్తిగాదు
గురువు విద్య లేక గురుతర ద్విజుఁడౌనె
విశ్వదాభిరామ వినుర వేమ

155.అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు
బహిళ దుఃఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రకుతంగ నేరఁడు
విశ్వదాభిరామ వినుర వేమ

156.కాలవశముఁ బట్టి కర్మజీవులపిండు
మత్తులగుచును మదమత్తులైరి
మత్తులయిన జనుల మనసేటి మనసయా
విశ్వదాభిరామ వినుర వేమ

157.కడిగివట్టియాస కడతేఱనీయదు
ఇడుములండుఁ బెట్టి యీడ్చుఁగాని
పుడమి జనులభక్తిఁ బొడమంగ నియ్యదు
విశ్వదాభిరామ వినుర వేమ

158.పాలలోన బులుసు లీలతోఁగలిసిన
విఱిసి తునుక లగును విరివిగాను
తెలివి మనసులోన దివ్యతత్వము తేట
విశ్వదాభిరామ వినుర వేమ

159.దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా

160.ధర్మమరసి పూని ధర్మరాజాదులు
నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి
ధర్మమే న్రుపులకు తారకయోగంబు
విశ్వదాభిరామ వినుర వేమ

Tuesday, January 19, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(121-140)

121.మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమా

122.ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి
సత్యనిష్ఠ వేఱు సత్యమొకటి
పరమఋషులు వేఱు భావ్యుఁ డొక్కండురా
విశ్వదాభిరామ వినుర వేమ

123.తారకమంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు
సమముగాను జూడఁ జక్కఁబడును
వెఱ్ఱిగాను జూడ వెలుగెల్ల బాఱురా
విశ్వదాభిరామ వినుర వేమ

124.సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు
ప్రక్రుతి నెఱుఁగకున్న భక్తిలేదు
పలువ లెట్టిరీతి భక్తి సల్పుదురయా
విశ్వదాభిరామ వినుర వేమ

125.ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చు
జూచుకనులువేఱు చూపువేఱు
చూపులో నమరిచి చూడంగవలవదా
విశ్వదాభిరామ వినుర వేమ

126.దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ

127.మన్నును దినమన్న మండేరు జనులార
మంటిలోనిమేలు మఱువనేల
నీళ్ళలోనిమేలు నిఖిలమై యుండురా
విశ్వదాభిరామ వినుర వేమ

128.జీవమేడ నుండు భావమెక్కడ నుండు
కాఁపురంబు లేడఁ గదిసియుండుఁ
దనరుచున్న రెంటిస్థల మేల తెలియరు
విశ్వదాభిరామ వినుర వేమ

129.ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక
తాను దినక లెస్స దాచుగాక
తేనె నీఁగె కూర్చి తెరువర్ల కియ్యదా
విశ్వదాభిరామ వినుర వేమ

130.ఇచ్చెడి వారలసంపద
హెచ్చునదే కాని లేమి యేలా కలుగున్
ఆచ్చెలమ నీళ్ళు చల్లిన
విచ్చలవిడి నూరుచుండు వినరా వేమా

131.పాలఁగలయునీరు పాలెయై రాజిల్లు
నదియు పానయోగ్య మయినయట్లు
సాధుసజ్జనముల సాంగత్యములచేత
మూఢజనుఁడు ముక్తి మొనయు వేమ

132.చెడినమానవులను చేపట్టి రక్షించి
కడకుఁజేర్చినట్టి ఘనులు దలఁప
కడగి పుణ్యమైనగల శివుసన్నిధి
నెడతెగకయునుందు రెపుడు వేమ

133.ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ

134.కన్నుపోవువాఁడు కాళ్ళుపోయినవాఁడు
నుభయులరయఁ గూడి యుండునట్లు
పేద పేదఁగూడి పెనగొని యుండును
విశ్వదాభిరామ వినుర వేమ

135.పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁ
గొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింప రాదయా
విశ్వదాభిరామ వినుర వేమ

136.అంత కొఱత దీఱి అతిశయకాముఁడై
నిన్ను నమ్మిచాల నిష్ఠతోడ
నిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గు
విశ్వదాభిరామ వినుర వేమ

137.తత్వము తిరమైన తావుల వెదకుచుఁ
దాను తత్వమగును తత్వయోగి
తలఁపులన్ని యుడుగఁ దానెపో తత్వంబు
విశ్వదాభిరామ వినుర వేమ

138.మాటలాడవేఱె మనసుకొలఁదియు వేఱె
యొడలగుణమువేఱె యోజవేఱె
యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు
విశ్వదాభిరామ వినుర వేమ

139.వెలఁది చక్కదనము వెరపైన యీడును
విభుని కరుణలేక వగతనుండు
నీదుకరుణలేక నేర్పులు కొఱగావు
విశ్వదాభిరామ వినుర వేమ

140.ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత
చింతచేత మిగులఁ జివుకు మనసు
చింతలేకయున్న చెడనిసంపదఁజూచు
విశ్వదాభిరామ వినుర వేమ

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(101-120)

101.ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁడిలమీద
మహిమఁజూపువాఁడు మధ్యముండు
వేషధారి యుదరపోషకుఁడధముండు
విశ్వదాభిరామ వినుర వేమ

102.హ్రుదయమందు నున్నయీశుని దెలియక
శిలలనెల్ల మ్రొక్కుజీవులార
శిలల నేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినుర వేమ

103.గంగగోవుపాలు గరిటెడైనను జాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినుర వేమ

104.బండమీఁద వెలమ పాటించిత్రవ్విన
నలయి కెక్కుడౌను నాశలేదు
గుంటపట్టు చెలమ కులముద్ధరించురా
విశ్వదాభిరామ వినుర వేమ

105.కాకిగూటిలోన కోకిల మున్నట్లు
భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు
గురుని గొల్చువెనక గురువు తా నౌనయా
విశ్వదాభిరామ వినుర వేమ

106.మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను
మనసు దిద్దరాదు మహి నెంతవారికి
విశ్వదాభిరామ వినుర వేమ

107.మనసునందు ముక్తిమలయుచు నుండంగ
మనసు లెఱుఁగలేక మనుజులెల్ల
మనసు నంటలేక మాయమై పోదురు
విశ్వదాభిరామ వినుర వేమ

108.మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగ లేరు
మనసుచేతఁ దగిలి మాయమైరి
మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినుర వేమ

109.మదినెఱిగినవాని మహిఁగాన నెందును
మది నెఱుంగువాఁడు మహిని నరుఁడు
వెదకి తనువులోన వేడ్కతో నినుఁజూచు
విశ్వదాభిరామ వినుర వేమ

110.బ్రహ్మము నెఱుఁగవు భావమందుండిన
తనువు గుడిగఁజేసి తన్ను నిలిపి
లోకబుద్ధివిడిచి లోఁజూపు చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ

111.నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు
తన్నుఁజూచుచుండఁదగులు మాయ
నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును
విశ్వద్దభిరామ వినుర వేమ

112.గాలి గాలి గలసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలపె మంట మంట
నీరు నీటఁ గలసె నిర్మలంబయి యుండె
విశ్వదాభిరామ వినుర వేమ

113.వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు
వెదకువానిఁ దాను వెదకుచుండు
వెదకనేర్చునట్టి వెరవరుల్ గలరొకో
విశ్వదాభిరామ వినుర వేమ

114.తను వలచినఁదా వలచును
దను వలవక యున్నఁదన్ను దా వలవడిలన్
దనదు పటాటోపంబులు
తనమాయలు పనికిరావు ధరలో వేమా

115.స్వానుభూతిలేక శాస్త్ర వాసనలచే
సంశయంబు చెడదు సాధకునకు
జిత్రదీపమునను జీఁకటి చెడనట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

116.శాంతమున సకలకార్యము
సంతోషంబునను బొందు సత్యము జయమౌ
పంతము చెల్లును ధర్మజుఁ
డెంతేసి ప్రయాసముల జయించెను వేమా

117.ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
తెగడువారె గాని తెలియలేరు
అమ్రుతస్వాదురుచులహస్త మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినుర వేమ

118.పురుషుఁడెన్నిగతుల బుట్టువు మొదలుగఁ
బాపచింతఁజేయు జాపలమున
మహిని కుంటినక్క మాంసముదిన్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

119.అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె
పిన్న పెద్దతనము లెన్న నేల
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా
విశ్వదాభిరామ వినుర వేమ

120.మొదటఁ బోయునీర మొగిబీజములు కెక్కి
మొదటి కుఱుకవేగ మొలక లెత్తు
మొలక ప్రిథివిఁ బెరిగి వెలయును వ్రుక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ

Friday, January 15, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(81-100)

81.పరుస మినుముసోకి బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతిఁ గలసినట్లు
పుష్పమఁదు దావి పొసఁగినట్లగు ముక్తి
విశ్వదాభిరామ వినుర వేమ

82.కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు
భూతలంబునందు బొందుగాను
కూలబడిన నరుఁడు కుదురుట యరుదయా
విశ్వదాభిరామ వినుర వేమ

83.సతము బాహ్యపూజ చాలఁజేసినపిదప
కపటము విడలేక కష్ట నరులు
ముక్తినొందలేక మునిగిరి తమమున
విశ్వదాభిరామ వినుర వేమ

84.ఊర్ధ్వలోకమందు నుచితక్రమంబున
రూప మేమి లేక రూఢితోను
పరమయోగి చూచు పరమాత్ముఁడితడని
విశ్వదాభిరామ వినుర వేమ

85.సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు
జ్ఞాన మమరియుండ సత్యముండు
జ్ఞానసత్యములును సమయమయిన ద్విజుఁడగు
విశ్వదాభిరామ వినుర వేమ


86.దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ

87.దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెవుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినుర వేమ

88.గాలిలేని దీపకళిక చందంబున
నలలుసుళ్ళులేని జలధిరీతి
నిశ్చలాత్మయున్న నిర్వికారంబున
ముక్తియండ్రు దాని మొగిని వేమ

89.మంటలోహములను మ్రాను చీలలయందు
పటముగోడలందుఁ బరగ నిసుక
బెట్టనంటునట్ల పెనఁగు దేహముజీవి
విశ్వదాభిరామ వినుర వేమ

90.కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల
మరయఁదత్వ మెల్ల నాత్మఁబుట్టు
తెలిసినందుకు మఱిధీరుఁడు గావలె
విశ్వదాభిరామ వినుర వేమ


91.అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగఁ దినఁగ వేము దీయనుండు
సాధనమునఁ బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

92.స్థూలము కనుగ్రుడ్డు సూక్షంబు కన్పాప
కంటిపాప నుండు కారణంబు
కారణమున బ్రహ్మకళ నెఱుగంగవలె
విశ్వదాభిరామ వినుర వేమ

93.తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు
సుమరసంబుజాడ భ్రమర మెఱుఁగు
పరమయోగి జూడభక్తుం డెఱుంగును
విశ్వదాభిరామ వినుర వేమ


94.అడవి దిరుగ లేదు ఆకసమున లేదు
అవనిఁ దీర్థయాత్రలందు లేదు
ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ

95.కప్పురంపు మనసు గాంక్షించుయోగికి
జ్ఞా నదీపశిఖయుఁ దానటించుఁ
గానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్చ
విశ్వదాభిరామ వినుర వేమ

96.నీ వాడిన నే నాడుదు
నీవుండిన నేను నుందు నిర్విణ్ణుఁడనై
నీవు తలంచినఁదలఁపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా

97.నీరు కార మాయె కారంబు నీరాయె
కారమైన నీరుకార మాయె
కారమందు నీరు కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినుర వేమ

98.శివుని యనుభవంబు స్రుష్టిలోపల లేక
సంశయంబు చెడదు సాధకులకు
చెలఁగుదివ్వె లేక చీఁకటీపాయునా
విశ్వదాభిరామ వినుర వేమ

99.ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
వెఱ్ఱిమనుజుఁ డేల వెదకు శివుని
ఇంద్రియముల రోసి ఈశునిఁ జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ

100.కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన
బాలమీఁద నేలపాఱు మనసు
తత్వ మెఱుఁగువెనక తన్వంగులేటికో
విశ్వదాభిరామ వినుర వేమ

Wednesday, January 13, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(61-80)

61.కూలినాలి చేసి గుల్లాముపని చేసి
తెచ్చిపెట్టు నాలు మెచ్చనేర్చు
లేమిఁజిక్కువిభుని వేమాఱు దిట్టును
విశ్వదాభిరామ వినుర వేమ

62.ఇంద్రియ పరవశుడుఁడధముం
డింద్రియ పరవశుఁడు భక్తియెడ మధ్యముఁడౌ
నింద్రియజయుఁ డుత్తముఁ జి
తేంద్రియసుతుఁడు విన మహేశుఁడు వేమా

63.తనగుణము తనకు నుండఁగ
నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో
తన గుణముఁదాను దెలియక
పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుఁడు వేమా

64.వెఱ్ఱివాని కయిన వేషధారికయిన
రోగికైన పరమయోగికైన
స్త్రీలఁజూచినపుడె చిత్తంబు రంజిల్లు
విశ్వదాభిరామ వినుర వేమ

65.తావసించుచోటఁ దగనల్గు డాయెనా
సౌఖ్యభూమి కపుడు జరుగువలయు
కొలఁకు లింకెనేని కొంగ లందుడునా
విశ్వదాభిరామ వినుర వేమ

66.భూమిలోనఁ బుణ్యబురుషులు లేకున్న
జగములేలనిల్చు సయముఁగాక
నంత దఱచుదొరక రాడ నాడనెగాని
విశ్వదాభిరామ వినుర వేమ

67.చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు
కొంచెమైన నదియు గొదువ కాదు
విత్తనంబు మఱ్ఱివ్రుక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమ

68.చెడ్డవాని మిగులఁ జెఱుచును దైవంబు
అడ్డపడదు వాని కాపదయిన
చెడినచేనుఁ జూచి యొడయఁడు మెచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ

69.ఎక్కడయినయాశ లినుమడియుండఁగా
తిక్కపట్టి నరుఁడు తిరుగుచుండు
కుక్కవంటి యాశ కూర్చుండ నీయందు
విశ్వదాభిరామ వినుర వేమ

70.అరయఁ దఱుచుకల్ల లాడెడు వారిండ్ల
వెడలకేల లక్ష్మి విశ్రమించు
నీరు నోటికుండ నిలువని చందాన
విశ్వదాభిరామ వినుర వేమ

71.గుణవతి యగు యువతి గ్రుహము చక్కగనుండు
చీకటింట దివ్వె చెలఁగురీతి
దేవియున్న యిల్లు దేవార్చన గ్రుహంబు
విశ్వదాభిరామ వినుర వేమ
72.ఇంటియాలు విడిచి యిల జారకాతల
వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాడు
పంటచేను విడిచి పరిగ యేరినట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

73.రాజవరుల కెపుడు రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరముచింత
యల్పనరుల కెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినుర వేమ

74.తల్లిదండ్రిమీద దయలేని పుత్రుఁడు
పుట్టనేమివాఁడు గిట్టానేమి
పుట్టలోణఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ

75.ముందరి పోటుల మ్మంపను
మందెందును గలదుగాని మహిలోపలనే
నిందల పోటులు మాంపెడు
మందెచ్చట నైనఁగలదె మహిలో వేమా

76.తత్వ మెఱుగువాఁడు దైవంబు నెఱుగును
సర్వసారములను జావఁ జేయు
కదళిమ్రింగునట్లు గరళంబు మ్రింగునా
విశ్వదాభిరామ వినుర వేమ

77.నీళ్ళమీద బుగ్గ నిలచిన యప్పుడు
తళ్ళువేగవచ్చి తాకుఁ గాక
విడెడుకుండకింత విభ్రాంతి పడుదురు
విశ్వదాభిరామ వినుర వేమ

78.హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల
వెతలఁ బడనియట్లు విద్యచేతఁ
దత్వమెఱుఁగు వెనక తనకుఁజింతేలరా
విశ్వదాభిరామ వినుర వేమ

79.జీవభావ మెఱుగఁ జెడ దెన్నతికి మది
దైవమును నెఱుంగఁదనరుబుద్ధి
తేజి ముదయమందఁ దిమిరంబు నిలువదు
విశ్వదాభిరామ వినుర వేమ

80.ఆశచేతమనుజు లాయువుగలనాళ్ళూ
దిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికిభాండమందు ముసరు నీఁగలభంగి
విశ్వదాభిరామ వినుర వేమ

Tuesday, January 12, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(41-60)

41.తాను గుడవలేఁడు తగవేడి యాప్తులఁ
జేరనీయఁడట్టి చెనటి గోవు
చేనిలోన బొమ్మఁ జేసికట్టినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

42.పూర్వ జన్మమందుఁ బుణ్యంబుసేయని
పాపిధనము కాశపడుటయెట్లు
విత్త మఱచికోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ వినుర వేమ


43.చమురు గలుగుదివ్వె సరవితో మండును
చమురు లేనిదెవ్వె సమసిపోవు
తనువు తేఱెనని తలఁపుతోడనెతీరు
విశ్వదాభిరామ వినుర వేమ

44.భూపతి క్రుపనమ్మి భూమిఁ జెఱచు వాఁడు
ప్రజలయుసురు దాకి పడును బిదప బంతి
నెగరవేయ బంతి యెందాక నిల్చురా
విశ్వదాభిరామ వినుర వేమ

45.పాప మనఁగవేఱె పరదేశమున లేదు
తనదు కర్మములను దగిలియుండు
కర్మ తండ్రిగాక కనికనకుం టొప్పు
విశ్వదాభిరామ వినుర వేమ

46.నక్క వినయములను నయగారములఁ బల్కి
కుడువ కెల్ల ధనము కూడఁబెట్టు
కుక్కబోను వాతఁ గూడుచల్లినరీతి
విశ్వదాభిరామ వినుర వేమ

47.వెళ్ళివచ్చునాఁడు మళ్ళి పోయెడునాఁడు
వెంటరాదు ధనము కొంచఁబోడు
తానదేడఁబోనొ ధనమేడ బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ

48.పుట్టు బిత్త్లివలెఁ బోవు బిత్తలివలెఁ
దిరుగు బిత్తలివలె దేహిధరణి
నున్న వాటికైన నుపకారిగా లేఁడు
విశ్వదాభిరామ వినుర వేమ

49.కాశిపోదు ననుచు గద కట్ట్గానేల
కాశితీర్థమునకుఁ గదలనేల
దోషకారి కెట్లు దొఱకురా యా కాశి
విశ్వదాభిరామ వినుర వేమ

50.ఇనుము వెఱిగెనేని ఇరుమాఱు ముమ్మాఱు
కాచియతుక నేర్చు కమ్మరీడు
మనసు విఱిగెనేని విఱియంట నేర్చునా
విశ్వదాభిరామ వినుర వేమ

51.పరినారీ దూరుండై
పరధనముల కాసపడక పరహితధారై
పరులలిగిన దానలుగక
పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమా

52.అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
యజ్ఞాన ముడిగి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా

53.నీళ్ళలోని చేప నెఱమంస మాశకు
గాలమందుఁజిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుఁడారీతిఁ జెడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమ

54.బొంది ఎవరిసొమ్ము పోషింపఁ బలుమారు
ప్రాణ మెవరిసొమ్ము భక్తిసేయ
ధనమ దెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ

55.నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
మేలువారి నమ్మి మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ వినుర వేమ

56.మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ
బెరుకువాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ

57.ఉసురు లేనితిత్తి ఇసుమంత నూదిన
పంచలోహములును భస్మమౌను
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినుర వేమ

58.మందుదినఁబోటు మానును
మందు దినం జేయుఁ బొలఁతి మహిలోఁదలఁపఁ
మందుదిన కుదురు రోగము
మందుదినం గలదు పుష్టి మహిలో వేమా

59.తలను పాగ పైని తగుపచ్చ్డము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లౌట బుద్ధిలో నెఱుగురా
విశ్వదాభిరామ వినుర వేమ

60.స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ
సేయని మనుజుండు చెడునిజంబు
ఏటికట్టు మ్రాని కెప్పుడు చలనంబు
విశ్వదాభిరామ వినుర వేమ

Monday, January 11, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము(21-40)

21.అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదువగాదు
కొండయద్దమందు గొంచమైయుండదా
విశ్వదాభిరామ వినుర వేమ

22.తనమదిఁ గపటము గలిగిన
తనవలెనే కపటముండుఁ దగజీవులకుఁ
తనమది కపటము విడిచినఁ
దన కెవ్వడు కపటిలేఁదు ధరలో వేమా

23.చంపఁదగినయట్టి శత్రువు తనచేతఁ
జిక్కెనేని కీడుసేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినుర వేమ

24.తాంసించి సేయఁదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విశయ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ

25.నీళ్ళలోన నోడ నిగిడి తిన్నగఁబ్రాకు
బైట మూరెడైనఁబ్రాక లేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాఁడు
విశ్వదాభిరామ వినుర వేమ

26.నీళ్ళ్లోన మొసలి నిగిడి యేనుఁగుఁబట్టు
బైట కుక్కచేత భంగపడును
స్ఠానబలిమి గాని తనబలిమి గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ

27.కులములో నొకండు గుణవంతుఁడుండెనా
కులము వెలయు వానిగుణము చేత
వెలయ వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
28.పంది పిల్ల లీను బదియు నైదింటిని
కుంజరంబు నీను గొదము నొకటి
నుత్తమపురుషుండు నొక్కఁడు చాలఁడా
విశ్వదాభిరామ వినుర వేమ

29.ఎఱుఁగువానిఁ దెలుప నెవ్వఁడయినను జాలు
నొరుల వశముగాదు నోరుఁదెల్ప
నేటివంక దీర్ప నెవ్వరితరమయా
విశ్వదాభిరామ వినుర వేమ

30.అల్పుఁడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకుఁ జల్ల గాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ

31.ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చుఁ బరమలుబ్ధుఁ
బంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ

32.గంగ పారుచుండు కదలనిగతితోద
ముఱికి పారుచుండు మ్రోత తోడ
దాత యోర్చినట్లు యధముఁడోర్వగలెఁడు
విశ్వదాభిరామ వినుర వేమ

33.కానివానిచేత కాసువీసము లిచ్చి
వెంటఁదిరుగుటెల్ల వెఱ్ఱితనము
పిల్లిపట్టఁ గోడి పిలిచినఁ బలుకునా
విశ్వదాభిరామ వినుర వేమ

34.పిసివానియింట పీనుఁగు వెడలిన
కట్టెకోలలకును గాసు లిచ్చి
వెచ్చమాయె నంచు వెక్కి వెక్కేద్చురా
విశ్వదాభిరామ వినుర వేమ
35.కష్టలొభివాని కలిమికి నాశించి
బడుగువాఁడు తిరిగి పరిణమించు
తగరువెంట నక్క దగిలినచందంబు
విశ్వదాభిరామ వినుర వేమ

36.లోభివానిఁజంప లోకంబులోపల
మందు వలదు వేఱెమతము గలదు
పైకమడుగఁ జాల భగ్గునబడిచచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ

37.మంటిలెల్లకల్ల మనసెల్ల దొంగకే
నేతిప్రాణ మింక నేటిబ్రతుకు
మాట సత్యమయిన మఱి శతాయుష్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ

38.కలిమినాఁడు నరుఁడు కానండు మదమున
లేమినాడు మొదలెలేదు పెట్టఁ
గలిమిలేమిలేని కాలంబు కలుగునా
విశ్వదాభిరామ వినుర వేమ

39.కనియుఁగానలేఁడు కదలింపఁడానోరు
వినియు వినంగ లేఁడు విస్మయమున
సంపద గలవాఁడు సన్ని పాతక మది
విశ్వదాభిరామ వినుర వేమ

40.తీర్ప నార్పలేని తీర్పరితన మేల
కూర్ప విప్పలేని నేర్పదేల
పెట్టిపోయలేని వట్టిబీరము లేల
విశ్వదాభిరామ వినుర వేమ

Friday, January 8, 2010

వేమన పద్యములు ప్రథమాశ్వాసము (1-20)పద్యములు

శివ కవులకు నవ కవులకు
శివ భక్త్కికి దత్త్వమునకు జింతామణికిన్
శివలోక ప్రమథులకును
శివునకు గురువునకు శరణు సేయర వేమా

శ్రీకరంబుగ వేమన చెప్పినట్టి
పద్యముల నెవ్వడేనియు బటనజేయు
నట్టి పురుషుడు మనముననిట్టిదనుచు
జెప్పరానట్టి వస్తువు జేరు వేమ

1.వేమ ననగ యోగి వెలసె లోకములోన
బూజులిడుడు పుణ్య పురుషులార
పూజ లిడినయంత భుక్తి ముక్త్కుల నిచ్చు
విశ్వదాభిరామ వినురవేమ

2.పలుకుమన్ననేల పలుకకయున్నావు
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకుమయ్య నీదు పలుకు నే నెరిగెద
విశ్వదాభిరామ వినురవేమ

3.ఆత్మశుద్ధిలేని యాచార మది యేల
భాండశుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ

4.నిక్కమయిన మంచినీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రళ్ళు తట్టెడేల
చదువ బద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ

5.నిన్ను జూచెనేని తన్నుదా మరచును
తన్ను జూచెనేని నిన్ను మరచు
నేవిధమున జనుడు నెరుగు నిన్నునుదన్ను
విశ్వదాభిరామ వినురవేమ

6.మురియువాడెవడు మురియని దెవ్వడు
సాటు జేసి చూద బట్టబయలు
సొరిది జలఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినురవేమ

7.గాజుకుప్పెలోని కడగుచు దీపంబు
నెత్తులుందు జ్ఞాన మట్టులందు
దెలిసినట్టీవారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినురవేమ

8.కల్లగురుఁడు కట్టు నెల్లకర్మంబుల
మధ్య గురుఁడు కట్టు మంత్రచయము
నుత్తముండు గట్టుయోగ సామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ

9.పెట్టిపోయలేని వట్టినరులు భూమి
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ

10.తాముగన్నవారు తముఁ గన్నవారు
జచ్చుటెల్ల తమకు సాక్షిగాదె
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబులా
విశ్వదాభిరామ వినుర వేమ

11.ఎఱుకమాలువాడు నేమేమి చదివినఁ
జదివినంత సేపె సద్గుణియగు
కదిసి తామరందుఁ గప్పకూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
12.కూటికి నెడఁబాసి కూర్చున్న మనుజుఁడు
వెలఁదులఁ గనుగొన్న వెతలఁజిక్కు
చెలఁగి యగ్నిఁజూచు శలభంబు చాద్పున
విశ్వదాభిరామ వినుర వేమ

13. కసువుఁ బసికిఁజేసె గాలి ఫణికిఁ జేసె
మన్నెఱలకుఁ జేసె మఱవకెట్లు
కుంభిని జనులకును గూడట్లు చేసెరా
విశ్వదాభిరామ వినుర వేమ

14. ఎవ్వరి గుణములును వేమన్న మానవు
చక్కఁజేయరాదు కుక్కతోఁక
గడుసురాలినిగన గంపఁబెట్టమ్మురా
విశ్వదాభిరామ వినుర వేమ

15.వేరుపురుగు చేరి వ్రుక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టుఁ జెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ

16.ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడవేఱు
పురుషులందుఁ బుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినుర వేమ

17.జీవిపోకముందె జీవ వస్తువులిచ్చి
జీవి నిలుపవలయు జీవనముగ
జీవి తొలఁగువెనక జీవ వస్తువు లేల
విశ్వదాభిరామ వినుర వేమ

18.కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెఱుఁగును
నీరు పల్ల మెఱుఁగు నిజముగాను
తనయుని జననంబు తల్లి తా నెఱుఁగును
విశ్వదాభిరామ వినుర వేమ

19.అంగమెల్ల వదలి యటు దంతములు నూడి
తనువు ముదిమిచేతఁ దఱచువడక
ముప్పు తిప్పలఁబడి మోహంబు విడువరు
విశ్వదాభిరామ వినుర వేమ

20.ఆడువారిఁగన్న నర్థంబు పొడఁగన్న
సారమైన రుచుల చవులు గన్న
అయ్యగాండ్రకైన నాశలు పుట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ
వేమన పద్యాలు

ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ